Te:NeMo-Openweb

From MozillaWiki
Jump to: navigation, search

నెమో వ్యాస అధోభాగము
ఓపెన్ వెబ్
మరల వ్యాస అధోభాగమునకు | ముఖ్య పేజి
ద్వారక నాథ్ (Dwaraka Nath)
మేరాజ్ ఇమ్రాన్ (Meraj Imran)
హేమ భాను ప్రియ (Hema Bhanu Priya)

ఓపెన్ వెబ్

ఈ సారి ఎక్కడినుండి మొదలు పెట్టాలి....?? అస్సలు ఓపెన్ వెబ్ గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువనే చెప్పాలి. అది ఓ సముద్రం. ఏది అసాధ్యం కాదు,అలా అని సూర్యున్ని పశ్చిమాన ఉదయించేల చెయి అనకండి, అది అసాధ్యం అని నాక్కూడా తెలుసు. ప్రపంచంలో ఎన్నో విషయాలు తెలుసుకున్న మనకి, ఓపెన్ వెబ్ గురించి అర్ధం చేసుకోవడం అంత కష్టం ఏమి కాదు. ప్రతి మనిషికి దేనికైనా సంభందించి తమ తమ అభిప్రాయాలుంటాయి. ఎవరికైనా మనం ఏదన్న చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళ ఆలోచనలను అర్ధం చేస్కోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

అందుకే ఓసారి అమ్మని అడిగాను,"అమ్మ!ఓపెన్ వెబ్ అంటే ఏంటి అని?" తన సమాధానం..."ఏంటి..? ఇప్పుడు మీరు వాడుతున్న అంతర్జాలం ఓపెన్ కాదా? చదవడానికి ఎంతో సమాచారం ఉందిగా.. ఎక్కడైనా ,ఎప్పుడైనా,ఏదైనా నలుగురితో పంచుకోగల్గుతున్నారు. ఎన్నో ఉచిత సమాచారాలు ఉండే రకంగా చుస్తే వెబ్ ఓపెన్ ఎ కదా! తానే కాదు, నేను అడిగిన చాలామంది ఇలానే స్పందించారు.

నిజం చెప్పాలంటే అంతర్జాలం అనకున్నంత ఓపెన్ (అందరికి అందుబాటులో) కాదనే చెప్పాలి. ఫై ఫై మెరుపులను చూసి ఓ నిర్ణయానికి రావడం ఎంత వరకు శ్రేయస్కారం? గుర్తుపెట్టుకోండి,ఇప్పుడు మనం మాట్లడుకోబోయేది వెబ్ ఎలా ఉందో కాదు,ఎలా పనిచేస్తుందని.మరి వెబ్ తాయార ?? (ఇవాళ ఇదోటి ఆదరకోడదాం). తొంబైల ముందు వరల్డ్ వైడ్ వెబ్ (www) అందరికి అందుబాటులో ఉండటం వలన ఐరోప పరిశోధన సంస్థ (CERN) వారు అంతర్జాలం లో ప్రచురితమయ్యే అన్ని విషయాలను,విలువలను చూచుటకు,మార్చుటకు,అభివృద్ధి చేయుటకు, మెరుగు పరుచుటకు దోహదపడింది. "View Source" కమాండ్ ను బ్రౌజరు లో అమలుపరుచుటకు కారణమైంది."హే,ఎవరో నా సైట్ ను కాపీ చేయడానికి నేనెల ఒప్పుకుంట?" ఇలా అనిపించడం సబబే,కాని నీకు తెలిసింది పది మంది తో పంచుకోగల్గినప్పుడే కొత్త ఆలోచనలను ,సృజనాత్మకతను మెరుగు పరుచుకునే అవకాశం ఉంది. గ్యానం అనేది పంచినప్పుడు పెరుగుతుందే తప్ప తరగదు.

ప్రజలు వీడియో స్ట్రీమింగ్ సర్వీసెస్ (ఆన్లైన్ ద్వారా తిలకించు విధానము),ఇంటరాక్టివ్ గేమింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్ మరియు ఇతర సేవలను వినియోగిస్తున్నారు. కాని వీటిలో చాల మటుకు ఓపెన్ వెబ్ కు సహకరించటం లేదు.ఉదాహరణకు మనం వీక్షించే ఎన్నో వీడియోలు ఫ్లాష్ కంటెంట్ లు కలిగి ఉన్నవే (mp3,doc వంటి ఫైల్లు). ఈ వీడియోలను విక్షియించాలంటే అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ అవసరం. ఫ్లాష్ ప్లేయర్ పరిగ్యాన అమలును ఇప్పటికి ప్రజల నుండి గోప్యంగానే ఉంచారు. మైక్రోసాఫ్ట్ కూడా అంతే. ఫ్లాష్ కు బదులుగా సిల్వర్ లైట్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇది మళ్ళి యాజమాన్య విలువలకు ప్రోత్సాహకంగా మారింది. ఇటువంటి టెక్నాలజీలు ఉచితంగా ప్రపంచంలోని డెవలపర్లందరికి అందుబాటులోకి ఉన్నాయా?? ఇటువంటి వాటి వలన ఎకచక్రాధిపత్యం పెరుగుతుంది. ఆ యాజమాన్యానికి మాత్రమే ఆ సాఫ్ట్ వేర్ ను అభివ్రుధి పరిచే అవకాశం ఉంది. దీని వలన మనకేమికావాలో తెలుసుకోకుండా,వారు విడుదల చేసే సాఫ్ట్వేర్ ల తోనే సర్దుకుపోతున్నాము. చివరిగా నష్టపోయేది మనమే.

మనం కళలు కనే వెబ్ ఇలాంటిదా?? ఇలాంటి రాచరికపు వెబ్ కోసమేనా మనం కళలు కన్నది? ఓపెన్ వెబ్ యొక్క ఆశయం ఇది కాదు. వెబ్ అన్నది ఇప్పుడు అంతటా ఉంది. అంతర్జాలాన్ని ఎన్నో చోట్ల మనం వాడుతున్నాం. చదువులో, వ్యాపారాల్లో,ఆసుపత్రుల్లో, సినిమాల్లో అన్నిటిలో అంతర్జాలం వాడుకలో ఉంది. ప్రతి ఒక్కరికి అంతర్జాలాన్ని వాడుకునే,దోహదపడే హక్కు ఉంది. మన ఊహలకు రోపాన్నిచ్చే శక్తి అంతర్జాలానికి ఉంది. వెబ్ ను ఓపెన్ గా అందరికి అందుబాటులో ఉచితంగా ఉపయోగించుకునే హక్కు మన అందరిది.

రండి, మన ఆలోచనలకు కళ్ళెం వేసే యాజమాన్య విలువలను ప్రక్కకు పెట్టి మనసృజనకు , అవసరాలకు తగిన విధంగా ఉండే ఓపెన్ వెబ్ ను ఆహ్వానిద్దాం, మన ఊహలకు రూపన్నిద్దాం!!!